Mexico Horror: భార్యను చంపి మెదడును చపాతిలో పెట్టుకొని తిన్న వ్యక్తి, పుర్రెను యాష్ ట్రేగా వాడిన కిరాతకుడు, దెయ్యం చెప్పినందుకే భార్యను చంపానని కథలు చెప్తున్న వ్యక్తి
ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఘోరంగా ప్రవర్తించాడు. ఆమె మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు (Man Eats Wife’s Brain). అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా (Ashtray) వాడాడు. మెక్సికోలోని ప్యూబ్లోలో ఈ దారుణ సంఘటన జరిగింది. 32 ఏళ్ల అల్వారో అనే వ్యక్తి బిల్డర్. 38 ఏళ్ల మరియా మోంట్‌సెరాట్‌ను గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు.
Mexico, July 08: ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఘోరంగా ప్రవర్తించాడు. ఆమె మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు (Man Eats Wife’s Brain). అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా (Ashtray) వాడాడు. మెక్సికోలోని ప్యూబ్లోలో ఈ దారుణ సంఘటన జరిగింది. 32 ఏళ్ల అల్వారో అనే వ్యక్తి బిల్డర్. 38 ఏళ్ల మరియా మోంట్‌సెరాట్‌ను గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే 12 నుంచి 23 ఏళ్ల వయస్సున్న ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా, జూన్ 29న అల్వారో దారుణానికి పాల్పడ్డాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. భార్య మెదడును చపాతీలో పెట్టుకుని తిన్నాడు. ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచాడు. ఆ తర్వాత సవతి కుమార్తెకు ఫోన్ చేశాడు. వారి తల్లిని చంపి మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఇంటికి వెళ్లి అల్వారోను అరెస్ట్ చేశారు. దెయ్యం ఆదేశించడంతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులకు అతడు చెప్పాడు. అలాగే భార్యను హత్య చేసిన నిందితుడి గదిలో చేతబడి ఆనవాళ్లు, బలిపీఠం వంటివి ఉండటాన్ని పోలీసులు గమనించారు.
కాగా, డ్రగ్స్ తీసుకునే అలవాటున్న అల్వారో సవతి కుమార్తెలను కూడా మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించింది. అతడు మానసిక రోగి కావచ్చని, అందుకే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానిక మీడియాకు ఆమె తెలిపింది.
(The above story first appeared on LatestLY on Jul 08, 2023 08:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

