Man Lights Firework on his Head: ఫుల్లుగా తాగి తలపై బాంబు పేల్చుకున్నాడు, పుర్రెను చీల్చేసిన టపాసులు, అమెరికాలోని టెక్సాస్ లో ఘటన

పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ (Party)చేసుకున్నాడు. బాగా తాగిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు.

Man Lights Firework on his Head: ఫుల్లుగా తాగి తలపై బాంబు పేల్చుకున్నాడు, పుర్రెను చీల్చేసిన టపాసులు, అమెరికాలోని టెక్సాస్ లో ఘటన

Texas, July 10: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అంటారు. సరదా కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. ఒకరు డ్యాన్స్ చేస్తే, మరొకరు తాగుతారు. ఇక సెలబ్రేషన్స్ లో బాణాసంచా(Fire works) పేల్చేవారు కొందరు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు. కానీ బాగా తాగిన వ్యక్తి...సంతోషంలో టపాసులు పేల్చాడు. కానీ అతను టపాసులు (Fire works) పేల్చింది రూమ్‌లో కాదు. ఏకంగా తన తలమీద టపాసులు పేల్చుకున్నాడు. దాంతో అవి ఏకంగా అతని తలను చీల్చాయి. తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో (Texas) వెలుగు చూసింది.  పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ (Party)చేసుకున్నాడు. బాగా తాగిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు.

Srilanka Crisis: శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో సీక్రెట్ బంకర్, దాని నుంచే పారిపోయి ఉంటారని అనుమానం, లంక అధ్యక్షుడి ఇంట్లో తాగి, వండుకొని తిన్న ఆందోళనకారులు 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాబ్లో మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదకర ఫీట్ చేసే సమయంలో పాబ్లో ఫుల్లుగా మందుకొట్టి ఉన్నాడని, ఆ మత్తులోనే ఈ చర్యకు పాల్పడ్డాడని అతని స్నేహితుడు వెల్లడించాడు.

Ranil Wickremesinghe Resignation: శ్రీలంకలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి, అధ్యక్షుడు పరార్, పదవికి రాజీనామా చేసిన ప్రధాని విక్రమసింఘే, ముఖ్యనేతల నివాసాలను చుట్టుముట్టిన ఆందోళనకారులు, అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి బీభత్సం 

ఈ ఘటనతో బాధితుడి కుటంబం దిగ్భ్రాంతికి గురయ్యారు. పాబ్లో రూయిజ్ తరచూ పార్టీలు చేసుకుంటుండే వాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇంత ప్రమాదకరంగా ఎన్నడూ ప్రవర్తించలేదంటున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 10, 2022 11:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).