కరోనా వైరస్ విజృంభణతో అల్లాడిపోతున్నఉత్తరకొరియాలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారు, అది ఎలాంటి వ్యాధి అనే విషయాలను మాత్రం వెల్లడిచింది. కాగా, దేశంలో కొత్తగా 26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొన్నది. దీంతో దేశంలో జ్వర సంబంధిత కేసులు 40 లక్షల 56 వేలకు చేరాయి. ఇప్పటివరకు దేశంలో 76 కరోనా కేసులు నమోదయ్యాయి.
North Korea has reported the outbreak of an “enteric epidemic.” It’s unclear how serious this new epidemic is, but some observers say North Korea aims to burnish Kim Jong Un’s image as a caring leader donating his private medicines to the stricken. https://t.co/BRjPESpNms
— The Associated Press (@AP) June 16, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)