Pangong, NOV 07: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు (Kim Jong UN) మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ (Unlimited) దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల (Russia) మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది.
అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది.