అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఇక ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్‌ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్‌ ట్రంప్‌ నిజమైన కుమార్తెనని పేర్కొంది.

 డొనాల్డ్ ట్రంప్‌ని అభినందిస్తూ ప్రధాని మోదీ పెట్టిన పోస్టుకి 20 మిల్లియన్ల వ్యూస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్

అయితే ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది.తన కూతురిని బాగా చూసుకోలే​కపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి.

Pakistani woman claims to be Donald Trump's daughter

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)