Israel-Hamas War: భారత్ ఉగ్రవాదానికి పూర్తిగా వ్యతిరేకం, మా మద్దతు ఇజ్రాయెల్‌కే అని స్పష్టం చేసిన భారత్, వారికి అండగా నిలబడతామని ప్రధాని మోదీ హామీ
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
- Read in
- తెలుగు
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అదే ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఇంతకముందు కూడా ప్రధానిమోదీ ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు ఈ విపత్కర పరిస్థితుల్లో తాము ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని పేర్కొన్నారు.అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు సాయం చేసేందుకు అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను మధ్యదరా సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌కు పంపింది.
Here's PM Modi Tweet
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 10, 2023 04:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

