Vladimir Putin: పుతిన్ ఆరోగ్యపరిస్థితి వెరీ సీరియస్, బ్లడ్ క్యాన్సర్ సహా పలు వ్యాధులతో బాధపడుతున్న రష్యా అధ్యక్షుడు, ఆయన ఆరోగ్యం గురించి సంచలనం రేపుతున్న ఆడియో టేప్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin) బ్లడ్ క్యాన్సర్‌తో (Blood Cancer) బాధపడుతున్నట్లు సమాచారం. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓలిగర్‌లలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ ఆరోగ్యంపై ఒక వ్యాపారవేత్తతో జరిపిన సంభాషణను ఓలిగర్ రికార్డు చేశాడు.

Vladimir Putin: పుతిన్ ఆరోగ్యపరిస్థితి వెరీ సీరియస్, బ్లడ్ క్యాన్సర్ సహా పలు వ్యాధులతో బాధపడుతున్న రష్యా అధ్యక్షుడు, ఆయన ఆరోగ్యం గురించి సంచలనం రేపుతున్న ఆడియో టేప్
Russian President Vladimir Putin | File Image | (Photo Credits: IANS)

Paris, May 15: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin) బ్లడ్ క్యాన్సర్‌తో (Blood Cancer) బాధపడుతున్నట్లు సమాచారం. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓలిగర్‌లలో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ ఆరోగ్యంపై ఒక వ్యాపారవేత్తతో జరిపిన సంభాషణను ఓలిగర్ రికార్డు చేశాడు. ఈ రికార్డింగ్‌లో రష్యన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు, పుతిన్ చనిపోతాడని అందరూ ఆశిస్తున్నట్లు ఓలిగర్ (oligarch )చెప్పాడు. ‘‘పుతిన్.. రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు. ఉక్రెయిన్‌తోపాటు (Ukraine) ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ దెబ్బతీశాడు. తప్పంతా అతడి తల (ఆలోచన)లోనే ఉంది. ఒక పిచ్చోడు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాడు’’ అని ఆ రికార్డింగ్‌లో ఓలిగర్ అన్నాడు.

COVID Hits North Korea: కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం, ఆరుమంది మృతి, గృహ నిర్భంధంలో లక్షా 87 వేల మంది పౌరులు 

ఓలిగర్ దాదాపు 11 నిమిషాల సంభాషణను రికార్డు (Voice Record) చేశాడని, అయితే, భద్రత దృష్ట్యా అతడి పేరును చెప్పలేమని ఈ విషయాన్ని వెల్లడించిన మీడియా సంస్థ చెప్పింది. ఇటీవల ఉక్రెయిన్ కూడా పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. లండన్ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. పుతిన్ ఎక్కడికెళ్లినా ముగ్గురు వైద్యులను తన వెంట తీసుకెళ్తుంటాడని, ముఖ్యంగా ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ తప్పనిసరిగా ఉంటాడని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పుతిన్ అనారోగ్యంపై ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

(The above story first appeared on LatestLY on May 15, 2022 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).