కిమ్‌ రాజ్యంలో కరోనా కల్లోలం రేపుతోంది. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది. దేశంలో 18 వేల మంది జ్వరంతో బాధపడుతున్నారని మే 12న అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,87,800కు చేరిందని.. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు.

కాగా, వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కిమ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 2020 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోలేదు. టీకాలు అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ తిరస్కరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)