Russia's Covid Vaccine: రష్యా టీకా తీసుకున్నవారికి జ్వరం, కండరాల నొప్పులు, 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా , వెల్లడించిన రష్యా ఆరోగ్య శాఖ

కరోనా కల్లోలం నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్యా కరోనా టీకా (Russia's coronavirus vaccine) స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ టీకా డోసులు (Sputnik V COVID-19 vaccine) తీసుకున్న ప్రతీ ఏడుగురు వాలంటీర్లలో ఒకరికి సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ (Russia Health Ministry) వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్‌ ఇస్తే వారిలో 14 శాతం మందిలో ఇతర లక్షణాలు కనిపించాయి.

Russia's Covid Vaccine: రష్యా టీకా తీసుకున్నవారికి జ్వరం, కండరాల నొప్పులు, 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా , వెల్లడించిన రష్యా ఆరోగ్య శాఖ
Sputnik V vaccine | (Photo Credits: Yalç?n Sonat / 123rf)

Moscow, Sep 19: కరోనా కల్లోలం నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్యా కరోనా టీకా (Russia's coronavirus vaccine) స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ టీకా డోసులు (Sputnik V COVID-19 vaccine) తీసుకున్న ప్రతీ ఏడుగురు వాలంటీర్లలో ఒకరికి సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ (Russia Health Ministry) వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్‌ ఇస్తే వారిలో 14 శాతం మందిలో ఇతర లక్షణాలు కనిపించాయి.

మొదటి డోసు తీసుకున్న వారిలో 14శాతం మందికి నిస్సత్తువ, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్టుగా ఆరోగ్య మంత్రి మురాషఖో తెలిపారు. 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే స్పుత్నిక్‌ వీ కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్‌ని (Russia's Covid Vaccine) హడావుడిగా మార్కెట్‌లో విడుదల చేసింది.

ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్‌ తెచ్చిన దేశంగా నిలవాలన్న ఉద్దేశంతో త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్టుగా విమర్శలు వచ్చాయి. మాస్కోలో సెప్టెంబర్‌ మొదట్లో తుది దశ ప్రయోగాలు మొదలు పెట్టారు. టీకా భద్రత, నాణ్యతపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా మార్కెట్‌లోకి విడుదల చేయ డంపై ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు అభ్యంతరాలు హెచ్చరికలు జారీ చేశారు. భా రత్‌కి కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. డీజీసీఐ అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్‌ ఎఫెక్ట్‌లు రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇండియాకు త్వరలో రష్యా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్, ఆర్‌డీఎఫ్ తో భారీ డీల్ కుదుర్చుకున్న డా.రెడ్డీస్ ల్యాబ్, పదికోట్ల మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీస్ ల్యాబ్ రెడీ

స్పుత్నిక్ వ్యాక్సిన్ తుది క్లినికల్ ట్రయల్స్ ఈ నెల ప్రారంభంలో మాస్కోలో ప్రారంభమయ్యాయి. అయితే, పూర్తి భద్రత మరియు సమర్థత తనిఖీలను దాటని ఏదైనా షాట్‌ను ఉపయోగించొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే భారతదేశంలో ఈ వ్యాక్సిన్‌ మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌తో పాటు పంపిణీకి హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీస్‌కు వంద మిలియన్ డోసుల వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది.దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిగిన తర్వాతే అనుమతులు ఇస్తామని అధికారులు తెలిపారు. క్లినికల్‌ ట్రియల్స్‌ విజయవంతం పూర్తి చేసిన అనంతరం దేశంలో ఈ ఏడాది చివరి నాటికి టీకాలు అందరికీ ఇవ్వడం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అంతకు ముందు మాట్లాడుతూ కొవిడ్-19 వ్యాక్సిన్‌పై రష్యా నుంచి వస్తున్న డేటాను ఉన్నత స్థాయి ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Sep 19, 2020 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).