Pakistan: పాక్‌లో హిందూ మహిళపై దారుణం, గర్భంలోనే శిశువు తలను కోసి ఆ భాగాన్ని క‌డుపులోనే వదిలేసిన నర్సులు, మహిళ పరిస్థితి విషమం

పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సులో ఓ హెల్త్ సెంట‌ర్‌లో గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసేసి (Staff Cut off Newborn's Head) ఆ భాగాన్ని క‌డుపులోనే వ‌దిలేశారు. 32 ఏళ్ల హిందూ మ‌హిళ ప‌ట్ల అక్క‌డి వైద్య సిబ్బంది ఇలా వ్య‌వ‌హ‌రించింది.

Pakistan: పాక్‌లో హిందూ మహిళపై దారుణం, గర్భంలోనే శిశువు తలను కోసి ఆ భాగాన్ని క‌డుపులోనే వదిలేసిన నర్సులు, మహిళ పరిస్థితి విషమం
Representational Image (Photo Credits: Pixabay)

Karachi, June 21: పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భంలో మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సులో ఓ హెల్త్ సెంట‌ర్‌లో గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసేసి (Staff Cut off Newborn's Head) ఆ భాగాన్ని క‌డుపులోనే వ‌దిలేశారు. 32 ఏళ్ల హిందూ మ‌హిళ ప‌ట్ల అక్క‌డి వైద్య సిబ్బంది ఇలా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌స్తుతం ఓ మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. తీవ్ర విషాదాన్ని క‌లిగించిన ఈ ఘ‌ట‌న ప‌ట్ల సింధు ప్ర‌భుత్వం వైద్య విచార‌ణ‌కు ఆదేశించింది. వివ‌రాల్లోకి వెళ్లే..

భీల్ వ‌ర్గానికి చెందిన హిందూ మ‌హిళ‌.. థార్‌పార్క‌ర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి పురుడు పోసుకునేందుకు వెళ్లింది. అయితే అక్క‌డ మ‌హిళా గైనకాల‌జీ వైద్యులు లేరు. అనుభ‌వం లేని సిబ్బంది వ‌ల్ల ఆ మ‌హిళ‌కు అష్ట‌క‌ష్టాలే మిగిలిన‌ట్లు లియాక‌త్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రాహీల్ సికింద‌ర్ తెలిపారు. శిశువును గ‌ర్భం నుంచి తీసే స‌మ‌యంలో హెల్త్ సెంట‌ర్ సిబ్బంది స‌రైన రీతిలో ఆప‌రేష‌న్ చేయ‌లేక‌పోయారు. ఆ శిశువు త‌ల‌ను కోసేసి ఆ మ‌హిళ గ‌ర్భంలోనే (Leave It Inside Hindu Woman's Womb) వ‌దిలేశారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆమెను స‌మీపంలో ఉన్న హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు.

ఢిల్లీలో దారుణం, భార్యను చంపి శవం పక్కన పడుకున్న భర్త, రాత్రి ఇద్దరూ తప్పతాగిన తర్వాత భోజనం వడ్డింపు సమయంలో గొడవ

లియాక‌త్ వ‌ర్సిటీ హాస్పిట‌ల్‌లో ఆప‌రేష‌న్ చేసి ఆ మ‌హిళ గ‌ర్భంలో ఉన్న మిగితా శ‌రీరాన్ని బ‌య‌ట‌కు తీశారు. శిశువు త‌ల మ‌హిళ గ‌ర్భంలో ఇరుక్కుపోయింద‌ని, ఆ మ‌హిళ మూత్రాశ‌యం కూడా దెబ్బ‌తిన్న‌ద‌ని, ఆమెను కాపాడేందుకు క‌డుపుకు స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింద‌ని, శిశువు త‌ల‌ను క‌డుపు స‌ర్జ‌రీ ద్వారా బ‌య‌ట‌కు తీసిన‌ట్లు ప్రొఫెస‌ర్ సికంద‌ర్ తెలిపారు. ఈ కేసు ప‌ట్ల సింధు ఆరోగ్య‌శాఖ డీజీ డాక్ట‌ర్ జుమాన్ భాటో విచార‌ణ‌కు ఆదేశించారు. సింధ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జుమాన్ బహోటో కేసుపై ప్రత్యేక విచారణలకు ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Jun 21, 2022 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).