Kabul, Oct 5: ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రముఖ హిందూ దేవాలయం సోమ్‌నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం (Taliban Destroyed Somnath Idol) చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆ స్థానంలో మహ్మద్ ఘజినీ దర్గాను (Mahmud Ghazni shrine in Afghanistan) పునర్నిర్మిస్తామని చెప్పారు. తాలిబన్లకు చెందిన అనస్ హక్కానీ మంగళవారం ఈ ఆలయానికి వెళ్లాడు. అక్కడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు రాత్రి ట్విటర్ ద్వారా ప్రకటించాడు.
ఇవాళ మేము పదో శతాబ్దపు ముస్లిం వారియర్ అయిన మహ్మద్ ఘజ్నవీ దర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో పటిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు. అక్కడి సోమ్‌నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేశాము అని ఆ ట్వీట్‌లో అనస్ చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న సోమ్‌నాథ్ దేవాలయ పునర్నిర్మాణం 1951లో పూర్తయింది. అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరగగా.. ఆయన మరణానంతరం ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీ సోమ్‌నాథ్ మందిర్ ట్రస్ట్‌కు ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉన్నారు. భారత్‌కు రెండు దేశాల నుంచి ముప్పు, మేము రెడీగా ఉన్నామని తెలిపిన ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మూడు స్థావారాల్లో వైమానిక బలగాలను మోహరించిందని వెల్లడి
Here's Anas Haqqani Tweet
Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j
— Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021
అనస్ హక్కానీ ఒక ట్వీట్‌లో, “ఈ రోజు, మేము 10 వ శతాబ్దపు ప్రఖ్యాత ముస్లిం యోధుడు, ముజాహిద్ సుల్తాన్ మహ్మద్ గజనావి మందిరాన్ని సందర్శించాము. గజ్నవి (అల్లాహ్ దయ అతనిపై ఉండవచ్చు) గజనీ ఈ ప్రాంతంలో బలమైన ముస్లిం పాలనను స్థాపించి నందున సోమనాథుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో ఆయన విగ్రహం పెడతామని తెలిపారు.