Widest Tongue- Guinness World Records: వామ్మో అంత పెద్ద నాలుకా.. 7.90 సెంటీ మీటర్ల నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్‌ రికార్డ్‌ (వీడియో)

సాధారణంగా మన నాలుక వెడల్పు ఎంత ఉండొచ్చు? మహా అయితే.. 2 అంగుళాలు ఉంటుంది. అయితే, అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన ఓ మహిళ నాలుక ఎంతో వెడల్పుగా ఉంది.

Widest Tongue- Guinness World Records: వామ్మో అంత పెద్ద నాలుకా..  7.90 సెంటీ మీటర్ల నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్‌ రికార్డ్‌ (వీడియో)
Widest Tongue- Guinness World Records (Credits: X)

Newdelhi, Aug 19: సాధారణంగా మన నాలుక (Tongue) వెడల్పు ఎంత ఉండొచ్చు? మహా అయితే.. 2 అంగుళాలు ఉంటుంది. అయితే, అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన ఓ మహిళ నాలుక ఎంతో వెడల్పుగా ఉంది. అవును.. బ్రిట్టనీ లకాయో 7.90 సెంటీమీటర్ల (3.11 అంగుళాలు) నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక (Widest Tongue) కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం (Guinness World Records) చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్‌ కార్డ్‌ అంత వెడల్పు ఉంది. గతంలో అమెరికాకే చెందిన ఎమిలీ షెలెంకర్‌ పేరిట ఈ రికార్డ్‌ (7.33 సెం.మీ) ఉండేది.

నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?

బెస్ట్ ఫ్రెండ్ చెప్పడంతో..

తాను చిన్నతనంలో ఏదైనా తినడానికి ఆతృతగా నోరు తెరిచినప్పుడు తన నాలుక పెద్దదిగా ఉందని తన కుటుంబం జోక్‌ చేసేదని బ్రిట్టనీ చెప్పారు. తన బ్రెస్ట్‌ ఫ్రెండ్‌ సూచనతో తన నాలుక వెడల్పు కొలుచుకున్నప్పుడు తనది పెద్ద నాలుక అన్న విషయం తెలిసిందన్నారు.

నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?

(The above story first appeared on LatestLY on Aug 19, 2024 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).