English Official Language of U.S: ఇకపై అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, కీలక ఫైల్‌పై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి
Washington, March 02: అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.‘‘ఇంగ్లిష్ అధికారిక భాషగా ఏర్పాటు చేయడం వల్ల సంభాషణలు క్రమబద్ధీకరించడమే కాకుండా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు బలోపేతం అవుతాయి. సమ్మిళిత, సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు’’ అని ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుందని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సమర్థతను నెలకొల్పుతుందని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుందని అభిప్రాయపడింది.
ఇంగ్లిష్‌ను అధికారిక భాషగా (Official language of the U.S) గుర్తిస్తూ ఇప్పటికే అమెరికాలోని 30 రాష్ట్రాలు చట్టం చేసినట్లు సమాచారం. అయితే, అమెరికా అధికార భాషగా గుర్తింపు కోసం కాంగ్రెస్ చట్టసభ సభ్యులు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే వైట్‌హౌస్ వెబ్‌సైట్ స్పానిష్ వెర్షన్‌ను తొలగించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడయ్యాక ఇదే విధంగా చేసినప్పటికీ.. బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించడం గమనార్హం.
(The above story first appeared on LatestLY on Mar 02, 2025 10:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

