Car Attack: జర్మనీలో ఘోరం.. క్రిస్మస్‌ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో)

జర్మనీలో ఘోరం జరిగింది.మాగ్డేబర్గ్‌ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ మార్కెట్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న వారిమీదకు దూసుకెళ్లింది.

Car Attack: జర్మనీలో ఘోరం.. క్రిస్మస్‌ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో)
Car attack (Credits: X)

Newdelhi, Dec 21: జర్మనీలో ఘోరం జరిగింది. మాగ్డేబర్గ్‌ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ మార్కెట్‌లో (Christmas market) ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న వారిమీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఇద్దరు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఓ డాక్టర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఇది జరిగిందని, ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను (50) అదుపులోకి తీసుకున్నామని, అతడు సౌదీ అరేబియాకు చెందిన వాడని అధికారులు తెలిపారు.

హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు 

Here's Video:

ఉద్దేశపూర్వకంగానే..

నిందితుడు రెంట్‌ కు తీసుకున్న కారుతో ఉద్దేశపూర్వకంగానే మార్కెట్‌లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, ఎందుకు ఇలా చేశాడో విచారణలో తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

(The above story first appeared on LatestLY on Dec 21, 2024 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).