US Student Visas: ఉన్నత చదువులకు అమెరికాకు భారీ స్థాయిలో భారతీయ విద్యార్థులు, మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
అమెరికాలో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి వెళ్లాలనుకునేవారికి ఈ ఏడాది భారీ స్థాయిలో వీసాలు మంజూరు చేసింది అమెరికా. ఈ వేసవిలో (జూన్, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది.
- Read in
- తెలుగు
అమెరికాలో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి వెళ్లాలనుకునేవారికి ఈ ఏడాది భారీ స్థాయిలో వీసాలు మంజూరు చేసింది అమెరికా. ఈ వేసవిలో (జూన్, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది. అమెరికాలో చదువుకోసం ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌లోనే ఉంటుందని తెలిపింది.
ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్‌వర్క్, సాంకేతికత సహాయంతో.. అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది. గతేడాది మొత్తంగా 1.25 లక్షల మందికి అమెరికా విద్యార్థి వీసాలు (Student visa) జారీ చేయగా.. వేసవిలో 82 వేల మందికి వీసాలను అందించింది. అమెరికాలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు.
Here's News
The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all…
— U.S. Embassy India (@USAndIndia) September 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 25, 2023 06:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

