US Mass Shooting: కాల్పుల మోతతో మళ్లీ దద్దరిల్లిన అమెరికా కాలిఫోర్నియా, విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు, ఏడుగురు అక్కడికక్కడే మృతి
అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతమోగింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి.
- Read in
- తెలుగు
అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పుట్టగొడుగుల ఫామ్‌లోని ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నలుగురిని హతమార్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ ట్రక్కు కంపెనీ షెడ్డు వద్ద మరో ముగ్గుర్ని కాల్చి చంపాడు. ఇంకొకరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం 5 గంటల్లోగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.
Here's Update News
*Update* Suspect is in custody. There is no ongoing threat to the community at this time.
— San Mateo County S.O (@SMCSheriff) January 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 24, 2023 01:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

