EPF Inoperative Account: మీ PF ఖాతాలో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. EPFO తెలిపిన ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలు ఎప్పుడు నిష్క్రియం (Inoperative) అవుతాయి? పాత ఖాతాలపై వడ్డీ ఎప్పటివరకు జమ అవుతుంది? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఉన్న పలు సందేహాలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స్పష్టతనిచ్చింది. ఈ మేరకు తమ అధికారిక సామాజిక మాధ్యమ (X) ఖాతా ద్వారా ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

EPFO (Photo-X)

EPF Inoperative Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలు ఎప్పుడు నిష్క్రియం (Inoperative) అవుతాయి? పాత ఖాతాలపై వడ్డీ ఎప్పటివరకు జమ అవుతుంది? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఉన్న పలు సందేహాలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స్పష్టతనిచ్చింది. ఈ మేరకు తమ అధికారిక సామాజిక మాధ్యమ (X) ఖాతా ద్వారా ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

మెటాలో రక్షణ లేదు.. నా కూతురుకే పురుషాంగం ఫోటోలు పంపారు.. మెటా మాజీ ఇంజినీర్ ఆర్టురో బెజార్ సంచలన వ్యాఖ్యలు..

సాధారణంగా ఒక ఉద్యోగి ఉద్యోగం మారినప్పుడు లేదా మానేసిన వెంటనే వారి EPF ఖాతా నిష్క్రియం కాదని EPFO తెలిపింది. 55 ఏళ్లు లేదా ఆపైబడిన వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత వరుసగా 36 నెలల (3 సంవత్సరాలు) వరకు ఎలాంటి ప్రాసెస్ జరగకపోతేనే ఆ ఖాతాను 'ఇన్యాక్టివ్'గా పరిగణిస్తారు.

వివిధ వయస్సుల్లో పదవీ విరమణ – ఇన్యాక్టివ్ అయ్యే కాలావధి:

50 ఏళ్ల వయస్సులో ముందస్తు రిటైర్మెంట్: 55 ఏళ్ల లోపు పదవీ విరమణ చేసిన సందర్భాల్లో ఖాతా వెంటనే క్లోజ్ కాదు. సభ్యునికి 58 ఏళ్లు వచ్చేవరకు ఖాతాపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. 58 ఏళ్ల వద్ద నిష్క్రియం అవుతుంది.

55 ఏళ్ల వద్ద రిటైర్మెంట్: 55 ఏళ్లకు రిటైర్ అయితే, తదుపరి 3 ఏళ్లు (అంటే 58 ఏళ్ల వయస్సు వరకు) వడ్డీ వస్తుంది. 58 ఏళ్ల వద్ద ఖాతా ఇన్యాక్టివ్ అవుతుంది.

58 ఏళ్ల వద్ద రిటైర్మెంట్: నిబంధనల ప్రకారం 58 ఏళ్లకు రిటైర్ అయితే, 61 ఏళ్ల వయస్సు వరకు వడ్డీ లభిస్తుంది.

70 ఏళ్ల వద్ద రిటైర్మెంట్: ఒకవేళ సభ్యుడు 70 ఏళ్ల వరకు సేవల్లో ఉండి రిటైర్ అయితే, 73 ఏళ్ల వయస్సులో ఖాతా నిష్క్రియంగా మారుతుంది.

ఖాతాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పాత ఈపీఎఫ్ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను నిర్లక్ష్యం చేయవద్దని EPFO సూచించింది. ఖాతా ఇన్యాక్టివ్ కాకుండా ఉండటానికి ప్రతి సభ్యుడు తమ UAN (Universal Account Number) వివరాలను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని, ఉద్యోగం మారినప్పుడు పాత EPF నిధులను కొత్త ఖాతాలోకి బదిలీ (Transfer) చేసుకోవాలని కోరింది. అర్హత ఉన్న సభ్యులు క్లెయిమ్‌లు దాఖలు చేసి తమ సొమ్మును సకాలంలో ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement