SLBC Tunnel Collapse Update

Hyderabad, Mar 10: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో (SLBC Tunnel Rescue Update) పంజాబ్‌ కు చెందిన మిషన్ ఆపరేటర్‌ గా పనిచేస్తున్న గురుప్రీత్‌ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపం తెలియజేశారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఈ మేరకు సదరు చెక్ ను మృతుడి కుటుంబానికి అధికారులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేశారు.

వికారాబాద్‌లో కల్తీ పండ్లరసం ప్యాకెట్ల కలకలం.. టెట్రా ప్యాకెట్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, వీడియో ఇదిగో 

చర్యల్లో పురోగతి

అమెరికాకు చెందిన రాబిన్‌ సన్ కంపెనీ ఉద్యోగిగా గురుప్రీత్ సింగ్ టన్నెల్‌ లో బోరింగ్ మిషన్ ఆపరేటర్‌ గా పనిచేస్తున్నారు. ఆయన  మృతదేహాన్ని పంజాబ్‌లోని వారి స్వగ్రామానికి తరలించారు. కాగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లో (SLBC Tunnel) సహాయక చర్యల్లో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో