Twitter CEO Linda Yaccarino Plan: ట్విటర్ సీఈవోగా లిండా నియామకం.. ట్విట్టర్ 2.0 ప్లాన్ వివరణ
ట్విటర్ సీఈవో (Twitter CEO)గా లిండా యక్కరినో (Linda Yaccarino) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) పై ప్రశంసల వర్షం కురిపించారు.
Newdelhi, May 14: ట్విటర్ సీఈవో (Twitter CEO)గా లిండా యక్కరినో (Linda Yaccarino) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) పై ప్రశంసల వర్షం కురిపించారు. తన నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తును సృష్టించే మస్క్ నుంచి తానెంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆ ప్రేరణే ట్విటర్ భవిష్యత్‌ను మార్చేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ 2.0 (Twitter 2.0) ప్రణాళిక వివరాలు చెప్పారు.
New Twitter CEO Linda Yaccarino discloses plan to build 'Twitter 2.0' #news #dailyhunt https://t.co/VbhJAAmsLF
— Dailyhunt (@DailyhuntApp) May 14, 2023
యూజర్ ఫీడ్‌బ్యాక్ కీలకం
'ఉజ్వలమైన భవిష్యత్తును సృష్టించేలా మస్క్ నుంచి ప్రేరణ పొందాను. ఈ విజన్‌ను ట్విటర్‌లో కొనసాగించేలా, వ్యాపారాన్ని కలిసి మార్చడంలో సహాయ చేయడంలో సంతోషిస్తున్నా’ను అని ట్వీట్ చేశారు. ఎన్‌బీసీ యూనివర్సల్‌కు అడ్వర్టైజింగ్ చీఫ్‌గా లిండా సుధీర్ఘకాలంగా పనిచేశారు. ఆ సంస్థలో అడ్వర్టైజింగ్ విభాగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నానని, ట్విట్టర్ 2.0ని రూపొందించడానికి యూజర్ ఫీడ్‌బ్యాక్ చాలా కీలకమని అన్నారు.
(The above story first appeared on LatestLY on May 14, 2023 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

