Volkswagen Layoffs: చరిత్రలో అతి పెద్ద లేఆప్స్.. లక్షమందిని ఇంటికి సాగనంపుతున్న వోక్స్‌వ్యాగన్.. మూడు ప్లాంట్లు మూసివేత..

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణకు జర్మనీ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ (Volkswagen) శ్రీకారం చుట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఏకంగా లక్ష ఉద్యోగాలను తగ్గించుకునేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Volkswagen (Photo Credits: Wikimedia Commons)

Volkswagen Layoffs:  ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణకు జర్మనీ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ (Volkswagen) శ్రీకారం చుట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఏకంగా లక్ష ఉద్యోగాలను తగ్గించుకునేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో ప్రకటించిన 50 వేల ఉద్యోగాల కోతకు అదనంగా మరొక 50 వేల ఉద్యోగాలను తొలగించే ప్రతిపాదనను కంపెనీ పర్యవేక్షక మండలి గురువారం ఆమోదించింది. ఈ నిర్ణయం వోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 15 శాతానికి సమానం కావడం గమనార్హం.

ఆగని ఉద్యోగాల కోత.. ముందస్తు హెచ్చరికలు లేకుండా 600 మందిని ఇంటికి సాగనంపుతున్న పేపాల్..భోరుమంటున్న ఉద్యోగులు..

యూరప్‌లోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన వోక్స్‌వ్యాగన్ తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా విధించిన సుంకాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు అస్థిరమైన డిమాండ్, చైనా మార్కెట్ నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ కారణంగా సంస్థ భారీగా నష్టపోయింది. ప్రస్తుత సాంకేతిక, ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించడం అత్యవసరమని కంపెనీ తెలిపింది. గతంలో 2009లో జనరల్ మోటార్స్ చేపట్టిన 50,000 ఉద్యోగాల కోతను అధిగమించి, ఆటో రంగా చరిత్రలోనే ఇది అతిపెద్ద కోతగా నిలిచింది.

హానోవర్, ఎమ్డెన్, జ్వికావ్, నెకార్సుల్మ్‌లలో ఉన్న నాలుగు కీలక జర్మన్ ప్లాంట్ల దీర్ఘకాలిక భవిష్యత్తుపై ప్రస్తుతం స్పష్టత లేదని, ప్రత్యామ్నాయ వినియోగంపై దృష్టి సారించినట్లు సంస్థ వెల్లడించింది. ఒకవేళ ఇవి మూతపడితే, వోక్స్‌వ్యాగన్ తన స్వదేశంలో ప్లాంట్లను మూసివేయడం ఇదే తొలిసారి కానుంది. ఇది ఆయా ప్రాంతాల సరఫరాదారులు, స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ముసాయిదా ప్రణాళికపై శక్తివంతమైన ఐజీ మెటల్ కార్మిక సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ.. లోయర్ సాక్సనీ రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో యాజమాన్యంతో రాజీ కుదిరింది. ఏ ప్లాంట్‌నూ అధికారికంగా మూసివేయలేదని, వివాదం పెరగకుండా భవిష్యత్ వ్యూహాలకు ఆమోదం తెలిపినట్లు ఐజీ మెటల్ నాయకులు క్రిస్టియాన్ బెన్నర్, డానియెలా కవల్లో స్పష్టం చేశారు. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలివర్ బ్లూమ్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. వోక్స్‌వ్యాగన్ గ్రూప్ భవిష్యత్తుకు ఇది బలమైన సంకేతమని అభివర్ణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement