Pragya Jaiswal: యాచకుల దెబ్బకు బిత్తరపోయిన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, డబ్బులు ఇవ్వాలంటూ వెంటపడటంతో అమ్మడు పర్సు ఖాళీ, సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్, ప్రస్తుతం బాల‌య్య అఖండ సినిమాలో నటిస్తున్న ప్రగ్య

హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా సన్నివేశం రియల్ లైఫ్ లో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు (ctress Pragya Jaiswal) ఎదురయింది. తమకు అంతోఇంతో దానం చేయాలంటూ కొందరు యాచకులు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ వెనుక‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Pragya Jaiswal: యాచకుల దెబ్బకు బిత్తరపోయిన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, డబ్బులు ఇవ్వాలంటూ వెంటపడటంతో అమ్మడు పర్సు ఖాళీ, సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్, ప్రస్తుతం బాల‌య్య అఖండ సినిమాలో నటిస్తున్న ప్రగ్య
Pragya Jaiswal (Photo-video Grab)

హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో బ్రహ్మానందంకు ఎదురైన అనుభవం రియల్ లైఫ్ లో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు (ctress Pragya Jaiswal) కూడా ఎదురయింది. తమకు అంతో ఇంతో దానం చేయాలంటూ కొందరు యాచకులు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ వెనుక‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో..జిమ్‌కు వెళ్లిన ప్ర‌గ్య క్లోజ్ చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే అప్పటికే అక్క‌డ ఆమె కోసం ఎదురు చూస్తోన్న యాచ‌కులు డ‌బ్బు ఇవ్వాలంటూ (Actress Pragya Jaiswal mobbed by Beggars) ఆమె వెంటపడ్డారు. వారిని చూసి ఇబ్బందిపడ్డ ప్రగ్యకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఇంతలో వాళ్లంతా ఆమె చుట్టూ చేరి ముందుకు క‌ద‌ల‌నివ్వ‌కుండా నిల‌బ‌డ్డారు. వారి నుంచి తప్పించుకుని ఎలాగోలా కారులోకి వెళ్లి కూర్చుంది. అయినా కూడా వాళ్లు వదలకుండా వెళ్లి.. కారు కిటికీ వ‌ద్ద నిల‌బ‌డి చేతులు చాపారు.

ఆర్ఆర్ఆర్‌..రెండు పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి, త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం

ఇక లాభం లేదనుకుని కొంత డబ్బు తీసి, వారిలో కొంద‌రికి ఇచ్చిన ప్రగ్య అంద‌రూ పంచుకోవాల‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ కారు వెళ్తున్న స‌మ‌యంలోనూ ఇంకా డ‌బ్బు ఇవ్వాలంటూ యాచ‌కులు ఆమె వెంట ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

Here's Viral Video

అన్నట్టు, ప్రస్తుతం ఈ అమ్మ‌డు బాల‌య్య హీరోగా రూపుదిద్దుకుంటోన్న‌ అఖండ సినిమాలో నటిస్తోంది. గతంలో బోయపాటి తెరకెక్కించిన జయ జానకీ నాయకా సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇదిలా ఉంటే ఈ అమ్మ‌డు కెరీర్ మొద‌ట్లో బాగానే ఆఫ‌ర్స్ అందుకున్న రాను రాను ఆమెకి ఆఫ‌ర్స్ వెనక్కి వెళ్లాయి. దీంతో సోష‌ల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా అవకాశాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది.

(The above story first appeared on LatestLY on Jul 03, 2021 02:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).