రాజమౌళి దర్శకుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’(SS Rajamouli’'s RRR) భారీ అంచనాలతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను యూనిట్ తెలియజేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్‌ను ఎడిట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.
రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యిందని, అంతే కాకుండా ఎన్టీఆర్, రామ్‌చరణ్ రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారని ప్రకటించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ని దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)