SS Rajamouli Allu Arjun Combo: జక్కన్న డైరక్షన్ లో ఐకాన్ స్టార్, ఇద్దరు ప్యాన్ ఇండియా స్టార్లు కలిసి త్వరలోనే మూవీ, ఇప్పటికే అల్లు అర్జున్ తో రాజమౌళి చర్చలు, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం

Hyderabad, March 17: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి (SS Rajamouli)‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపును సాధించారు. ఇక బాహుబలి (Bahubali) వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ (RRR)చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మార్చి 25న రిలీజ్‌కు రెడీ అయిన ఆర్ఆర్ఆర్ కోసం సామాన్య ప్రేక్షకుల దగ్గర్నుండీ.. సెలబ్రిటీల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ స్టార్ డైరెక్టర్, కొంత బ్రేక్ తీసుకుని తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన జక్కన్న, ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నాడట. అయితే ఈ సినిమా తరువాత మరో స్టార్ హీరోతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు జక్కన్న అప్పుడే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన క్రేజీ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల ‘పుష్ప – ది రైజ్’ (Pushpa)చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఇండియా వైడ్‌గా అభిమానులను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Bigg Boss Fame Himaja: కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేసిన బిగ్‌బాస్ ఫేం హిమజ, ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసిన ముద్దుగుమ్మ

అయితే ఈ సీక్వెల్ తరువాత బన్నీ భారీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని (Sanjaylila Bansali)కలిసిన బన్నీ, త్వరలో ఆయనతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాజమౌళి మహేష్‌తో సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టును బన్నీతో ఓకే చేయనున్నాడట. ఈమేరకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ పవర్‌ఫుల్ కథను కూడా రెడీ చేశాడట. ఈ కథ బన్నీకైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన చెప్పడంతో రాజమౌళి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Godfather Movie Update: చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్, గాడ్‌ఫాదర్‌ చిత్రంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో, ట్విట్టర్ ద్వారా తెలిపిన మెగాస్టార్

ఒకవేళ ఇదే నిజమైతే.. త్వరలోనే రాజమౌళి – అల్లు అర్జున్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రావడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నాయి. మరి నిజంగానే వీరిద్దరి కాంబో సెట్ అవుతుందా లేక ఇది కూడా ఓ గాసిప్‌లాగే మిగిలిపోతుందా అనేది తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.