Akhanda-2 Announced: నందమూరి బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీ, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ లో అఖండ-2 రాబోతుంది, ఇదుగో పోస్టర్
బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' (Akhanda) ఓ టర్నింగ్ పాయింట్. లాక్‌డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' (Akhanda-2) అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.
Hyderabad, OCT 16: బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' (Akhanda) ఓ టర్నింగ్ పాయింట్. లాక్‌డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' (Akhanda-2) అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు. నేడు ఉదయం అఖండ 2 సినిమా పూజా కార్యక్రమం కూడా జరగబోతుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ కి వెళ్లనుంది.
The blockbuster combo's BB4 is Akhanda2 - Thaandavam
After a Hat-trick of sensational blockbusters #Simha, #Legend & #Akhanda...
The blockbuster combo's #BB4 is #Akhanda2 - Thaandavam 🔱
This time, the EPIC MASSIVE COMBINATION will cause a divine vibration GLOBALLY ❤🔥
Shoot begins soon 💥💥
'GOD OF MASSES'… pic.twitter.com/rWwvSiK90v
— 14 Reels Plus (@14ReelsPlus) October 16, 2024
అయితే ఈసారి అఖండ 2ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో బాలయ్యకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కానుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. 'స్కంద' డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి (Boyapati).. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడంతో అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీన షూటింగ్ డిసెంబరుకి పూర్తవుతుంది. దీని తర్వాతే 'అఖండ 2' షూటింగ్‌లో బాలకృష్ణ పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు.
(The above story first appeared on LatestLY on Oct 16, 2024 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

