Etthara Jenda Song From RRR: త్రిపుల్ ఆర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్, ఆంథం సాంగ్ ప్రోమో విడుదల చేసిన జక్కన్న, ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్న మూవీ టీమ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండ అంటూ సాగే ఈ పాట మంచి దేశభక్తి గీతంలా కనిపిస్తుంది. ఈ పాట రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు మొదలు పెట్టనుండగా.. మరో ట్రైలర్ కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Hyderabad, March 12: బాహుబలితో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli)....మరోసారి తన మాయాజాలం చూపించనున్నారు. మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న త్రిపుల్ ఆర్ (RRR) మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడింది. దీంతో ఒక్కో అప్‌డేట్ అందిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లు హీరోలుగా రూపొందిన ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు సైతం నటించి, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ (RRR)నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల కోసం.... మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టగా మరోసారి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కొత్త పాట రానుంది. మార్చి 14న ఎత్తరా జెండా అనే పాటని విడుదల చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సెలెబ్రేషన్ ఆంథమ్ (Anthem) అంటూ ఈ పాటని రిలీజ్ చేయనుండగా.. శనివారం సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
ప్రోమోను బట్టి చూస్తే.. నెత్తురు మరిగితే ఎత్తర జెండా..(Etthara Jenda) సత్తువ ఉరిమితే కొట్టర కొండ అంటూ సాగే ఈ పాట మంచి దేశభక్తి గీతంలా కనిపిస్తుంది. ఈ పాట రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు మొదలు పెట్టనుండగా.. మరో ట్రైలర్ కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. ఈలోపు సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా భారీ రెస్పాన్స్ దక్కుతుంది.
(The above story first appeared on LatestLY on Mar 12, 2022 09:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

