Guntur Karam Update: సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, అమెరికా థియేటర్‌ నుంచి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్, ఈ నెల 6న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేయనున్న మేకర్స్
Guntur Karam (photo-X)

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఆ వేదికపై నుంచే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. మహేశ్ బాబును ఇంతకుముందు చూడని విధంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించనున్నాడు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక అప్ డేట్.. టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ని అమెరికా థియేటర్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. కాలిఫోర్నియా సినీ లాంచ్ ప్రియాంక సెవెన్ సినిమాస్లో ఈ చిత్రానికి సంబంధించి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఫస్ట్ టైం ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇలా అమెరికాలో లైవ్ ఇవ్వడం జరుగుతోంది. మరిక ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు ఎవరు వస్తున్నారనేది ఆసక్తి కరంగా మారింది.

కుర్చీమ‌డ‌త‌పెట్టి సాంగ్ పై కుర్చీతాత ఫ‌స్ట్ రియాక్ష‌న్, ఇలా అంటాడ‌ని అస్స‌లు ఊహించ‌లేదు!

మహేశ్ బాబు ఇంతవరకూ వేయని నాటు స్టెప్పులు ఈ సినిమాలో ఆయనతో వేయించాడు. దాంతో ఆడియన్స్ ఈ కొత్తదనానికి బాగా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని పొలిటికల్ ఫైట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

Here's Makers Tweet

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ జనంలోకి దూసుకుపోయాయి .. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' ఎక్కడ చూసినా వినిపిస్తోంది. శ్రీలీల - మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.