Kurchi Madathapetti Song (PIC@ X)

Hyderabad, DEC 30: త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) ‘గుంటూరు కారం’(Guntur Kaaram) సినిమా సంక్రాంతికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుసగా ఏదో ఒక అప్డేట్, పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన రెండు పాటలు, గ్లింప్స్, మహేష్ బాబు మాస్ పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘కుర్చీ మడతపెట్టి..’ అనే ఓ డైలాగ్ తో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి.. నేడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు గుంటూరు కారం చిత్రయూనిట్. ఫుల్ మాస్ బీట్ తో ఈ పాట సాగింది. ఈ పాటకు మహేష్, శ్రీలీల (Sreelila) అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.

 

అయితే ఈ డైలాగ్ ని ఒక తాత ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో ఈ డైలాగ్, ఆ తాత (Kurchi tatha) బాగా పాపులార్ అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్ తో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) సాంగ్ చేయడంతో తాత మరింత వైరల్ అవుతున్నాడు. ఆ తాత ఇంటర్వ్యూ కోసం పలు యూట్యూబ్ ఛానల్స్ ట్రై చేస్తున్నాయి. కుర్చీ తాత తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ సాంగ్ పై స్పందించాడు. కుర్చీ తాత మాట్లాడుతూ.. ఆ సినిమాలో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్ తో పాట చేసి, డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ కి పాట చేసాడంటే ఆనందంగా ఉంది. ఇది దేవుడిచ్చిన అదృష్టం, మీ అభిమానం. నాకు అవకాశం వస్తే ఆ పాటకి కచ్చితంగా డ్యాన్స్ చేస్తాను అని చెప్పారు. ఇక మూవీ యూనిట్ ఈ కుర్చీ తాతకు, ఇందులో DJ మిక్స్ చేసిన హరీష్ కు కొంత అమౌంట్ ఇచ్చారని సమాచారం. గుంటూరు కారం సినిమా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ మాస్ కుర్చీ పాటకు మాత్రం థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. కుర్చీలు విరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.