Pushpa-2 Dialogue Leak: అభిమానులకు అల్లు అర్జున్ ఊహించని సర్‌ ప్రైజ్.. పుష్ప-2 డైలాగ్ తో సందడి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ‘బేబీ’ ఈవెంట్‌లో ఘటన

‘తగ్గేదే లే’ అంటూ పుష్ప మూవీతో ఎంతగానో అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2లో విభిన్న గెటప్ లో రెట్టింపు జోష్ గా కనిపిస్తున్నారు. ఈ సీక్వెల్ లో అర్జున్ ఏ పంచ్ డైలాగ్ చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

Pushpa-2 Dialogue Leak: అభిమానులకు అల్లు అర్జున్ ఊహించని సర్‌ ప్రైజ్.. పుష్ప-2 డైలాగ్ తో సందడి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ‘బేబీ’ ఈవెంట్‌లో ఘటన
Allu Arjun (Credits: Twitter)

Hyderabad, July 21: ‘తగ్గేదే లే’ అంటూ పుష్ప (Pushpa) మూవీతో ఎంతగానో అలరించిన స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun).. పుష్ప-2లో విభిన్న గెటప్ లో రెట్టింపు జోష్ గా కనిపిస్తున్నారు. ఈ సీక్వెల్ లో అర్జున్ ఏ పంచ్ డైలాగ్ (Punch Dialogue) చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ దిశగా అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన బేబీ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో, ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో అప్రిసియేషన్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బేబీ మూవీ చాలా బాగుందని ప్రశంసించిన ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

USA Horror: అమెరికాలో ఘోరం.. భారతీయ విద్యార్థినిపై పిడుగు.. స్నేహితులతో పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఘటన.. పిడుగుపాటుతో పక్కనే ఉన్న కొలనులో పడిపోయిన విద్యార్థిని.. 20 నిమిషాల పాటు ఆగిన గుండె.. బ్రెయిన్ డ్యామేజ్.. యువతి పరిస్థితి విషమం

చివర్లో సర్ ప్రైజ్ 

చివర్లో అభిమానులు పుష్ప-2 డైలాగ్ కావాలని కోరగా ఆయన ఓ పంచ్ డైలాగ్ వినిపించారు. ‘‘ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది..పుష్పా గాడి రూల్’’  అని అల్లు అర్జున్ అనడంతో అభిమానుల సంబరం ఆకాశాన్నంటింది. ఇక్కడ పుష్ఫ-2 డైలాగ్ చెబుతానని తాను అస్సలు అనుకోలేదని అల్లు అర్జున్ చెప్పారు. ఈ డైలాగ్‌ తో ప్రస్తుతం అభిమానుల్లో సంచలనం రేకెత్తిస్తోంది. పుష్ఫ-2పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Telangana Floods: వీడియో ఇదిగో, నీట మునిగిన ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం, దుర్గ భవాని ఆలయం చుట్టూ భారీ వరద

(The above story first appeared on LatestLY on Jul 21, 2023 08:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).