Newyork, July 21: అమెరికాలో (America) ఘోరం జరిగింది. పై చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని (Indian Student) పిడుగుపాటుకు (Light Strike) గురైంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె (Heart) లయ తప్పింది. దీంతో మెదడు డ్యామేజీ (Brain Damage) అయ్యి ప్రస్తుతం ఆమె జీవన్మరణ పోరాటం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. భారత్ కు చెందిన సుశ్రూణ్య కోడూరు(25) యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. జులై మొదటివారంలో ఆమె తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులోని ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళ్తుంది.
అప్పటికే వాతావరణం ముసురుపెట్టి చిన్నగా వాన మొదలైంది. క్రమంగా పెరిగిన వాన ఉరుములు, మెరుపులతో జడివానగా మారింది. ఊహించనివిధంగా సుశ్రూణ్యపై పిడుగుపడింది. దీంతో, ఆమె పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఈ క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు గుండె లయతప్పడంతో సుశ్రూణ్య మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువులు పేర్కొన్నారు. విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్‌మీ' ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.