ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’  టైటిల్‌, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)గా చిత్రబృందం ఖరారు చేసింది. ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది’ అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది.  అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక  ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌ వేడుకలో చిత్ర బృందం గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో హీరో  ప్రభాస్‌, కమల్‌ హాసన్‌ , నిర్మాత అశ్వనీదత్‌ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు.

twitter

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)