తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెదక్ జిల్లాలోని శ్రీ వన దుర్గ భవాని దేవాలయాన్ని భారీ వరద చుట్టుముట్టింది. ఏడుపాయల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వీడియో ఇదిగో..
Here's Video
మెదక్ - శ్రీ వన దుర్గ భవాని దేవాలయం ఏడుపాయల వద్ద పరిస్థితి.#Edupayala #Medak pic.twitter.com/6pJCy6pjZ7
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)