Jr. NTR (Credits: FB)

Hyderabad, May 17: టాలీవుడ్ స్టార్ హీరో (Tollywood Star Hero) జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హైకోర్టు మెట్లేక్కారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో (Land Dispute) ఈ మేరకు అయన  హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే గీత లక్ష్మి 1996 నుండి ఇదే ప్రాపర్టీ మార్ట్ గెజ్ ద్వారా ఐదారు బ్యాంక్స్ నుంచి లోన్స్ పొందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ఫ్లాట్ అమ్మే సమయంలో ఆ విషయాన్నీ దాచి పెట్టింది. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గెజ్ ద్వారా లోన్ తీసుకున్నట్లు ఆమె ఎన్టీఆర్ కు తెలిపింది. దీంతో ఒక్క బ్యాంక్ లోన్ క్లియర్ చేసిన ఎన్టీఆర్ ఫ్లాట్ ను తీసుకున్నారు.

ఇదేం నిర్లక్ష్యం?? నాలుగేళ్ల బాలిక వేలికి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుకకు చేశారు.. కేరళలోని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ ఘటన

అలా విషయం బయటకు..

మిగతా బ్యాంకుల్లో ఋణం ఉండటంతో సదరు ఫ్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. దీంతో అసలు విషయం ఏంటో ఎన్టీఆర్ కి తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 2019 లోనే బ్యాంకు మేనేజర్లపై, ఫ్లాట్ అమ్మిన గీతపై  ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డీఆర్టీ రావడంతో ఎన్టీఆర్ కోర్ట్ మెట్లెక్కారు. జూన్ 3 లోపు డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది.

తెలంగాణలో థియేటర్ల బంద్‌ ఫేక్ న్యూస్‌, క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌