NTR-Allu Arjun: 'పార్టీ లేదా పుష్ప' అంటూ తారక్ ట్వీట్.. 'వస్తున్నా' అని రీ-ట్వీట్ చేసిన బన్నీ.. అసలేంటి విషయం??

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు. దీనికి అదే రీతిలో బన్నీ ఇచ్చిన స్పందన సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నది.

NTR-Allu Arjun: 'పార్టీ లేదా పుష్ప' అంటూ తారక్ ట్వీట్.. 'వస్తున్నా' అని రీ-ట్వీట్ చేసిన బన్నీ.. అసలేంటి విషయం??
NTR-Allu Arjun (Credits: Twitter)

Hyderabad, April 9: అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే (Birthday) సందర్భంగా స్టైలిష్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ (NTR).. సోషల్ మీడియా వేదికగా హిలేరియస్‌గా నవ్వించారు. దీనికి అదే రీతిలో బన్నీ ఇచ్చిన స్పందన సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నది. అసలేం జరిగిందంటే..  “నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ.. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి.” అంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా స్పందించారు. “విషెస్ చెప్పినందుకు నీకు థ్యాంక్యూ బావ.. నీకు నా హగ్స్” అంటూ స్టైలిష్ స్టార్.. తారక్‌ ట్వీట్‌కు స్పందించారు. అల్లు అర్జున్ ట్వీట్‌కు ఈ సారి అదిరిపోయే రిప్లయి ఇచ్చారు తారక్. “ఓన్లీ హగ్సేనా? పార్టీ లేదా పుష్ప” అంటూ లాఫ్ ఎమోజీని జత చేశారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా 'వస్తున్నా' అంటూ రిప్లయి ఇచ్చారు.

Nayanathara: అభిమాని అత్యుత్సాహం.. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. తారక్, బన్నీ చేసిన ట్వీట్స్ రాబోయే ఆయా హీరోల చిత్రాల్లోని స్పెషల్ డైలాగ్స్ కావడం విశేషం.

Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్

(The above story first appeared on LatestLY on Apr 09, 2023 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).