Nayanathara: అభిమాని అత్యుత్సాహం.. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nayanathara: అభిమాని అత్యుత్సాహం..  వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?
Credits: Twitter

Hyderabad, April 8: ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి గురువారం తంజావూరులోని తమ కులదైవం ఆలయాన్ని నయన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులతో దంపతులు ఫొటోలు కూడా దిగారు.

Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్

అనంతరం అక్కడి నుంచి రైలులో తిరిగి బయలుదేరారు. అయితే, నయన్ రైలులోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. ఆమెతో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.

(The above story first appeared on LatestLY on Apr 08, 2023 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).