Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్

పుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Pushpa-2: చీరకట్టులో అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం.. రౌద్రం ఉట్టిపడేలా లుక్
Pushpa2 (Credits: Twitter)

Hyderabad, April 8: పుష్ప-2 ద రూల్ హవా మొదలైంది. నిన్న వేర్ ఇజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేస్తుండగా.. తాజాగా చీరకట్టులో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పిక్ చూస్తేనే పుష్ప-2లో బన్నీ పాత్ర తీవ్రత ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. కాళీమాత అవతారాన్ని తలపించే వేషధారణతో అల్లు అర్జున్ లుక్ బీభత్సంగా ఉంది.

Pushpa 2 Teaser Video: అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్‌, పుష్ప 2 టీజర్‌ వచ్చేసింది, పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థమంటూ.

మెడలో నిమ్మకాయల దండ, మెడలో హారాలు, చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, జాకెట్, చీరకట్టి అపర కాళిలా రౌద్రం ఉట్టిపడేలా ఉన్నాడు. ఒకచేతిలో తుపాకీ పుష్ప క్యారెక్టర్ ను చాటుతోంది. అటు, పుష్ప-2 ద రూల్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

ఉత్తమ దర్శకుడిగా బలగం డైరక్టర్ వేణుకి అంతర్జాతీయ అవార్డు, ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు కైవసం చేసుకున్న బలగం మూవీ

(The above story first appeared on LatestLY on Apr 08, 2023 09:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).