Mia Khalifa Divorce: భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన పోర్న్ స్టార్ మియా ఖలీఫా, రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్, కలిసి ఉండలేమని..స్నేహితులుగా ఉంటామని తెలిపిన మియా
వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు (Mia Khalifa announces divorce) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను ట్వీట్ (Mia Khalifa Instagram) ద్వారా వెల్లడించింది.
వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు (Mia Khalifa announces divorce) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను ట్వీట్ (Mia Khalifa Instagram) ద్వారా వెల్లడించింది. దాదాపు ఒక సంవత్సరం నుండి కలిసి ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేశామని, అర్థం చేసుకోవడానికి కౌన్సెలింగ్ వంటివి కూడా తీసుకున్నామని.. ఇక కలిసి ఉండలేమని ఫిక్స్ అవడంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు మియా ( Former adult star Mia Khalifa) చెప్పుకొచ్చింది.
భార్య భర్తలుగా విడిపోయినా మంచి ఫ్రెండ్స్‌గా ఉంటాం, విడిపోతున్నందుకు ఏం బాధపడడం లేదు, ఇద్దరం విడివిడిగా తమ కుటుంబంతో కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నామని, విడిపోవడానికి ఇది కారణం అని చెప్పలేను కానీ, ఇక్కడితో ఈ రిలేషన్‌ని ఎండ్ చేస్తున్నాం.. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం.. ఒకరినొకరు గౌరవించుకుంటాం.. అంటూ భర్త (Swedish husband Robert Sandberg) నుండి విడిపోతున్నట్లు మియా ఖలీఫా పోస్ట్ చేసింది.
పోర్న్ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మియా పోర్న్ అభిమానులకు శృంగార దేవతగా మారింది. మియా ఖలీపా రాబర్ట్ 2019 లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే వారి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ఆమె హృదయపూర్వక నోట్ రాసింది. వార్షికోత్సవ శుభాకాంక్షలు @robertsandberg. అమెరికాలో మీరు మా కోసం తీసుకున్న ప్రతి ధైర్యమైన అడుగుకు ధన్యవాదాలు, ప్రతిరోజూ ఉదయాన్నేకాఫీతో నన్ను మేల్కోలావు. అలాగూ నవ్వులను పంచావు. ఇంకా ఆకలేస్తే కడుపు నిండా అద్బుతమైన భోజనాన్ని అందించావు. మీలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం నాకు దేవుడిచ్చిన గొప్పవరమంటూ నోట్ రాసింది.
Mia Khalifa and Husband Robert Sandberg Divorce:
View this post on Instagram
నా జీవితంలో నేను సాధించిన అతి పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది నిన్ను పొందమే.. ఐలవ్ యూ అంటూ ట్వీట్ చేసింది ఈ అమ్మడు. ఇక ఈ జంట జూన్ 2020 లో వివాహ వేడుకను నిర్వహించాలని అనుకున్నారు, కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దీనిని నిలిపివేశారు. ఈ నెలలో ఇద్దరు సన్నిహితులకు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ పార్టీ ఇస్తారని అనుకుంటుండగా విడాకులు తీసుకున్నామంటూ అందరికీ షాక్ ఇచ్చింది మియా.
(The above story first appeared on LatestLY on Jul 27, 2021 08:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

