Raj Kundra Arrested: ఈజీ మనీ కోసం యువతులతో పోర్న్ చిత్రాలు, పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ముంబై పోలీస్‌ కమిషనర్‌
Raj Kundra (Photo Credits: Twitter)

వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త ఇప్పటికే పలు వివాదాలతో కేసుల్లో ఇరుక్కున్న సంగతి విదితమే. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ (Raj Kundra Arrested) చేయడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఐపీఎల్‌ బెట్టింగులు, బిట్‌ కాయిన్‌ కుంభకోణం ఇతర విషయాల్లో రాజ్‌కుంద్రాపై పలు కేసులు ఉన్నాయి. తాజాగా ఆయన వెబ్‌ సిరీస్‌ల పేరుతో యువతలకు గాలం వేసి వారితో అశ్లీల చిత్రాలను తీస్తున్నాడన్న ఆరోపణతో ముంబై పోలీసులు (Mumbai Police) సోమవారం అరెస్ట్‌ చేశారు.

లైవ్‌ స్ట్రీమింగ్‌ యాప్‌లు, బెట్టింగ్‌లు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈజీ మనీ కోసం కుంద్రా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. అశ్లీల చిత్రాలను యాప్‌ల (Mobile Apps) ద్వారా విడుదల చేస్తున్నారని ఫిబ్రవరిలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే! ఇప్పటికే వీడియోలను పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. తాను ఏ తప్పు చేయలేదంటూ రాజ్‌కుంద్రా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు 2009లో వివాహం చేసుకున్నారు