Side Effects of Porn: షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు
Porn . Image Used for Representational Purpose Only. (Photo Credits: File Image)

చేతిలో సెల్ ఫోన్ ఉండి ఇంటర్ నెట్ ఉంటే చాలా చాలామంది పోర్న్ వీడియోలకు అడిక్ట్ అవుతుంటారు. అయితే పోర్న్ వీడియోలను ఎక్కువగా చూడటం వల్ల చాలా నష్టాలు (Side Effects of Porn) ఉన్నాయట. ఇదే విషయాన్ని ఓ సంస్థ సర్వే చేసి తెలిపింది. పోర్న్ వీడియో చూసినప్పుడు (Can Watching XXX) సంతోషంగా అనిపించినా ఆ తరువాత అది స్లో పాయిజన్‌లా మీ మెదడును తొలిచేస్తుందట. మిమ్మల్ని ఒక మానసిక రోగిలా మార్చేస్తుందట. అంతేకాదు అది మీ భవిష్యత్తును సైతం తుంచేసే ప్రమాదం ఉంద‌ని హెచ్చ‌రించింది ఆ సర్వే.

పోర్న్ వీడియోలు ఎక్కువగా చూసేవారిలో అంగ స్తంభన సమస్యలు ( Porn-Induced Erectile Dysfunction) ఎదుర్కొంటారని, పోర్న్ అతిగా చూసేవారికి సాధారణ సెక్స్‌పై ఆసక్తి క్ర‌మంగా త‌గ్గిపోతుంద‌ని.. ఇత‌రుల సెక్స్‌ను చూస్తూ ఆనందించే మానసిక సమస్యలు వ‌స్తాయ‌ని పేర్కొంది. పోర్న్ వీడియోల‌పై తాజాగా 118 ప్రశ్నలతో ఆన్‌లైన్, సోషల్ మీడియా ద్వారా సర్వే నిర్వ‌హించారు బెల్జియం, డెన్మార్క్, యూకేలకు చెందిన పరిశోధకులు.. మొత్తం 3,267 మంది పురుషులు ఈ స‌ర్వేలో పాల్గొన‌గా.. ఇందులో హస్త ప్రయోగం, పోర్న్ ఎన్నిసార్లు చూస్తారు? ఎంతసేపు చూస్తున్నారు? భాగస్వామితో సెక్సును ఎంజాయ్ చేస్తున్నారా? లాంటి ప్రశ్నలను సంధించారు.

భార్యభర్తలు కలిసి పోర్న్ సినిమాలు చూడటం వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు, మీ సెక్స్ లైఫ్ మరింతగా ఆస్వాదించడానికి పోర్న్ సహాయపడుతుందట, అదెలాగో చూద్దామా..

స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన యూనివర్విటీ ఆఫ్ యాంట్వెర్ప్ హాస్పిటల్ ప్రొఫెసర్ గుంటెర్ డే విన్ అన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అత్యధికంగా పురుషులు పోర్న్ వీడియోలు చూస్తున్నార‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. వారంలో సుమారు 70 నిమిషాలు పోర్న్ చూస్తున్నార‌ని.. వీరిలో కొందరు 5 నుంచి 15 నిమిషాలు మాత్రమే చూసి వ‌దిలేస్తే.. ఇంకా కొంత‌మంది మాత్రం.. ఎక్కువగా అవే చూస్తున్నారని వెల్ల‌డించారు.

ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారా..అయితే రూ. 3 వేలు కట్టండి, ఇటువంటి బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు వస్తే స్పందించకండి, తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు

అయితే.. వీరిలో 35 ఏళ్ల వయస్సు లోపు పురుషుల్లో 23 శాతం మందికి అంగ స్తంభన సమస్యలు వ‌స్తున్నాయ‌ని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉండొచ్చ‌ని అంచ‌నా వేశారు. పోర్న్ చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటు ప‌డేవారు.. త‌మ భాగ‌స్వామితో సెక్స్ చేసే స‌మ‌యంలో మాత్రం.. అంగం స్తంభన సమస్యల‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని ప్రొఫెసర్ విన్ వెల్ల‌డించారు.