Representational Image | (Photo Credits: File Image)

New Delhi, July 27: ఫేక్ న్యూస్, అలాగే లింకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు చిక్కుల్లో పడే ప్రమాదముంది. తాజాగా ఇలా ఫైక్ లింకులతో పలువురిని మోసం చేయాలని ప్రయత్నించిన గ్యాంగ్ ను ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులకు తెలియన వారు ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి (You were watching porn, pay fine) అంటూ బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు ఇచ్చారు.

ఈ నోటీసులు అందుకున్న వారు దాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి అంటూ తమకు నోటీసులు వచ్చాయని బాధితులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నోటీసుల్లోరూ .3,000 జరిమానాగా చెల్లించాలని కూడా వారు కోరినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఢిల్లీ సైబర్‌ క్రైం బ్రాంచ్‌ ఈ కేసును సుమోటోగా తీసుకుని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బాధితులకు వచ్చిన బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులను (bogus pop-up notices) టెక్నిలక్‌ టీం పరిశీలించి.. ఇవన్ని చెన్నై నుంచి వచ్చినట్లు తెలిపింది. దాంతో ఓ టీం (Gang dupes internet users) చెన్నైలో వారం రోజుల పాటు మకాం వేసి.. నిందితులు ముగ్గురు గాబ్రియల్ జేమ్స్, రామ్ కుమార్ సెల్వం మరియు బి. ధీనుశాంత్ లను అదుపులోకి తీసుకుంది. విచారణలో ధీనుశాంత్‌ బోగస్ పోలీసు నోటీసులు, పోర్న్ చూసిన  ఇంటర్నెట్ వినియోగదారులకు వాటిని పంపించడం వంటి మొత్తం ఆపరేషన్‌కు సంబంధించిన సాంకేతిక భాగాన్ని అతని సోదరుడు బి. చందర్‌కాంత్ నిర్వహిస్తున్నారని తెలిపాడు.

స్మార్ట్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తున్నారా..ఈ విషయాలను గమనించకుంటే డేంజర్‌లో పడినట్లే, పోర్న్ వీడియోలు చూసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలపై ఓ లుక్కేసుకోండి

అతడు కంబోడియా రాజధాని నమ్ పెన్ సమీపంలో ఉన్న వీల్ పోన్ నుంచి వీటన్నింటిని ఆపరేట్‌ చేసేవాడని తెలిపాడు. "ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో, మోసం చేసిన డబ్బును తరలించడానికి 20 కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు కనుగొన్నామని పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు గుర్తించబడిన యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులలో ఉపయోగించిన క్యూఆర్ సంకేతాల ద్వారా 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇలా వచ్చిన డబ్బును సోదరుడు చందర్‌కాంత్ క్రిప్టోకరెన్సీల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తరలిస్తున్నట్లు ధీనుశాంత్ వెల్లడించాడు. డబ్బును దాచడానికి మరిన్ని ఖాతాలను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నందున ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయాలని పోలీసులు తెలిపారు.