Gehana Vasisth: అవి పోర్న్ వీడియోలు కావు, మేము అసలు సెక్స్ వీడియోలే చేయలేదు, ముంబై పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై స్పందించిన నటి గెహనా వశిష్ట్‌
Gehana Vasisth Arrested (Photo Credits: Instagram)

నీలి చిత్రాలు చేస్తున్నారంటూ అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై నటి గెహనా వశిష్ట్‌ స్పందించారు. తాము ఎలాంటి పోర్న్‌ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్‌ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కావాలనే కొంతమంది తమను టార్గెట్‌ చేశారని ‘గంధీ బాత్‌’ ఫేమ్‌ గెహనా జూమ్ వేదికగా ఆరోపించింది.

శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ ఒక వీడియోను షేర్‌ చేసింది గెహనా. పోర్న్‌ సినిమాల్లో తాను నటించనే లేదని, తమ వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్‌ కేటగిరీ కిందకి రాదనిపేర్కొంది. మేము చేసినవి ఏక్తాకపూర్‌ లాంటి వారు చేసిన వీడియోల్లాంటివే తప్ప, అందులో అశ్లీలం ఎంతమాత్రం లేదంటూ తెలిపింది. ముందు తమ వీడియోలను చూసి, అపుడు అవి పోర్న్‌ అవునో కాదో తేల్చాలని మీ అందరినీ కోరుతున్నానని వ్యాఖ్యానించింది. ఎరోటికా కంటెంట్‌తో పోర్న్‌ను కలపడం సరైంది కాదంది. నిజానికి ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న అసలైన పోర్న్‌ వీడియోలపై దృష్గి పెట్టాలని ఆమె కోరింది.

ఈజీ మనీ కోసం యువతులతో పోర్న్ చిత్రాలు, పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ముంబై పోలీస్‌ కమిషనర్‌

అయితే ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసులుగా పేరున్న ముంబై పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. నిజమైన నేరస్థు లెవరో, కోర్టులు తేలుస్తాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని తెలిపింది. కావాలనే తనను, శిల్పాశెట్టి, కుంద్రాను టార్గెట్‌ చేస్తున్నారని గెహనా వశిష్ట్‌ ఆరోపించింది.

ఈ నెల 23 వరకు పోలీస్‌ కస్టడీలో రాజ్ కుంద్రా, నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా

రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ భారతదేశంలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారని, ఈ సమయంలో ఈ సంస్థ ద్వారా పోర్న్ ఫిల్మ్‌ల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులు సమకూర్చుకున్నట్టు సమాచారం. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో గెహానా వశిష్ట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు కుంద్రాను సోమవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. కుంద్రాతోపాటు, ర్యాన్ థార్ప్‌ను కూడా మంగళవారం కోర్టుముందు హాజరు పర్చిన పోలీసులు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే.