Naga Chaitanya Samantha Divorce: విడాకులపై తొలిసారి స్పందించిన నాగచైతన్య, డైవర్స్ తో ఇద్దరం హ్యపీ, మంచికోసమే నిర్ణయం తీసుకున్నామన్న చై
తమ విడాకులపై తొలిసారి స్పందించారు నాగచైతన్య(Naga chaitanya Open ups ). సమంత(Samantha)తో విడిపోవటం(divorce) అనేది తమ ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమన్నారు నాగచైతన్య(Naga chaitanya) అన్నారు. బంగార్రాజు (Bangarraju) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad January 13: తమ విడాకులపై తొలిసారి స్పందించారు నాగచైతన్య(Naga chaitanya Open ups ). సమంత(Samantha)తో విడిపోవటం(divorce) అనేది తమ ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమన్నారు నాగచైతన్య(Naga chaitanya) అన్నారు. బంగార్రాజు (Bangarraju) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవల మీ జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించారు?’ అని విలేకరులు ప్రశ్నించగా, ‘ఆ సమయంలో కుటుంబమంతా అండగా నిలిచింది. ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమది. తను హ్యాపీ. నేను కూడా సంతోషంగా ఉన్నా. కెరీర్‌పరంగానూ ఇద్దరం హ్యాపీనే’ అని సమాధానం ఇచ్చారు.
Divorce is something taken in the best interest of both of us. If she is happy with it, I’m also happy.
- #NagaChaitanya #Bangarraju pic.twitter.com/eeyCBU210m
— OverSeasRights.Com (@Overseasrights) January 12, 2022
గతేడాది అక్టోబరులో(October) తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు నాగచైతన్య, సమంత జోడీ(samantha naga chaithanya divorce ) సంయుక్తంగా ప్రకటించింది. ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్రయాణం చేయడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఒక దశాబ్దానికిపైగా స్నేహం ఉండటం మా అదృష్టం. ఇది మా మధ్య ప్రత్యేకమైన బంధాన్ని నిలిపి ఉంచుతుందని నమ్మకం. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు కావాలి. ముందడుగు వేయడానికి మాకు అవసరమైన గోప్యతని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ ఇద్దరూ ఒకే రకంగా ట్వీట్ చేశారు. పెళ్లిరోజుకి నాలుగు రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించారు. దీని వెనక కారణాల్ని మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. తాజాగా నాగచైతన్య స్పందన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
నాగార్జునతో కలిసి నాగచైతన్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. కృతిశెట్టి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
(The above story first appeared on LatestLY on Jan 13, 2022 12:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

