Niharika Konidela Divorce: కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న నాగబాబు కూతురు నిహారిక, చైతన్య దంపతులు.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.

(Photo-Twitter)

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక  కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లి రాజస్థాన్‌లో జరిగిందని, పిల్లలు లేరని దరఖాస్తులో ఉంది. చైతన్య జొన్నలగడ్డ - నిహారికల విడాకులకు కారణాలు ఏంటో తెలియదు గానీ వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement