Prabhas Movie: శివుడిగా ప్రభాస్.. పార్వతిగా నయనతార.. మంచు విష్ణు భారీ మూవీ ప్లాన్?
హీరో మంచు విష్ణు తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను సెట్‌పైకి తీసుకొచ్చారు.
Hyderabad, Sep 24: హీరో మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ఓ పాన్ ఇండియా (Pan India) సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను (Bhaktha Kannappa) సెట్‌పైకి తీసుకొచ్చారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివుడి పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారని మంచు విష్ణు కన్ ఫర్మ్ చేశాడు.
పార్వతి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ పాత్రను నయనతార పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్ నటి ఈ విషయాన్ని వెల్లడించింది. మంచు విష్ణు మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు.
(The above story first appeared on LatestLY on Sep 24, 2023 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

