Newdelhi, Sep 24: పదేళ్ల వయసులోనే ఓ బాలుడు సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు కాపాడాడు. భారీ రైలు ప్రమాదం (Train Accident) తప్పించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ (West Bengal) లో మల్దా జిల్లాలోని ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు హరిశ్చంద్రపుర్ రెండో బ్లాక్ లోని మషల్దా గ్రామ పంచాయతీలోని కరియాలి గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి పని కోసం వలస వెళ్లడం వల్ల.. తల్లి, సోదరి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న కుంటలో చేపలు పట్టడానికి వెళ్లాడు ముర్సెలీమ్. అతడు చేపలు పడుతున్న ప్రదేశానికి సమీపంలో రైలు పట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో ముర్సెలీమ్ రైలు పట్టాల కింద పెద్ద గుంత ఉండటం గమనించాడు. ఈ ప్రాంతంలో ఇటీవల వర్షాలు పడటం వల్ల.. పట్టాల కింద కంకర కొట్టుకుపోయి గుంత పడినట్లు భావిస్తున్నారు.
Sharp-eyed Class V student Mursalin's clearheaded act saved a train mishap in #Bengal.
Read to know more.https://t.co/gY1Aau9jBq
— The New Indian Express (@NewIndianXpress) September 23, 2023
ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు విప్పి..
అంతలోనే పట్టాలపై వందల మంది ప్రయాణికులతో కాంచన్ జుంగా ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకువస్తోంది. దీనిని గమనించి అప్రమత్తమైన ముర్సెలీమ్.. వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు విప్పి లోకో పైలట్ కు సిగ్నల్ ఇచ్చాడు. అలా టీషర్టు ఊపుతూ కొద్దిసేపు నిలబడ్డాడు. ఇది గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై.. రైలు నిలిపివేశాడు. అనంతరం ఇంజిన్ దిగి చూసి బాలుడిని అభినందించాడు. అనంతరం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రాన్ని పూడ్చివేశారు. గంట తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది. ఈ సంఘటన తర్వాత ముర్సిలీమ్ స్థానికంగా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే తరఫున ముర్సెలీమ్ కు అవార్డు ప్రకటించారు.