Rajamouli & Mahesh Babu Movie: రాజమౌళి..మహేష్ బాబు సినిమా అదేనా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న న్యూస్, 2022 ప్రారంభంలో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు..

బాహుబలితో తెలుగు సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు, ఓటమన్నదే లని రాజమౌళి, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా సెట్స్ మీదకు రాబోతుందనే విషయం తెలిపిందే. ఇటీవల రాజమౌళి.. మహేష్‌తో ఓ సినిమా (Rajamouli & Mahesh Babu Movie) చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Rajamouli & Mahesh Babu Movie: రాజమౌళి..మహేష్ బాబు సినిమా అదేనా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న న్యూస్, 2022 ప్రారంభంలో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు..
Rajamouli Mahesh Babu (Photo-Facebook)

బాహుబలితో తెలుగు సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు, ఓటమన్నదే లని రాజమౌళి, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా సెట్స్ మీదకు రాబోతుందనే విషయం తెలిపిందే. ఇటీవల రాజమౌళి.. మహేష్‌తో ఓ సినిమా (Rajamouli & Mahesh Babu Movie) చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రేక్షకులు సినిమా అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పనుల్లో రాజమౌళి (SS Rajamouli) బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావడానికి వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

ఇక మహేష్‌ బాబు (Mahesh Babu) సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్‌లు రాజమౌళి, మహేష్‌ సినిమాపై ఓ క్లారిటీని ఇచ్చాయి.

సర్కారి వారి పాట షూటింగ్ దుబాయ్‌లో, ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ అనంతరం అక్టోబర్‌లో రాజమౌళి, ఎస్‌వీపీ అనంతరం మహేష్‌ బాబు కొంచెం ఫ్రీ అవ్వడంతో 2022 ప్రారంభంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే మహేష్‌ కూడా తన ప్లాన్‌ మార్చుకున్నట్లు టాలీవుగ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

Here's Netizen Tweet

సర్కారు వారి పాట అనంతరం ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పకుండా నేరుగా రాజమౌళి సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్‌తో చేయబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారని రాజమౌళి ముందే ప్రకటించారు. అదేవిధంగా ఎప్పటిలాగే ఈ సినిమాకు సంబంధించిన కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తారని తెలిపారు. ఈ వార్తలు ఇలా ఉంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే టాలీవుడ్లో అప్పుడే దీనిపై రూమర్లు మొదలయ్యాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది, అక్టోబర్ 13న రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) విడుదల, దుమ్ము రేపుతున్న కొత్త పోస్టర్

ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త తాజాగా ఇంటర్నెట్లో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ.. మమఏష్ బాబు అభిమానులు పలు జోష్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

(The above story first appeared on LatestLY on Feb 02, 2021 03:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).