సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న‘సర్కారు వారి పాట’ షూటింగ్ (Sarkaru Vaari Paata Shoot Begins) మొదలైంది. దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ ప్రకటించింది. ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ‘సర్కారు వారి పాట’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.
Here's Movie Update
The Auction and the Action begins 🎬 #SarkaruVaariPaataShuru 💥
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus#SarkaruVaariPaata 🔔 pic.twitter.com/qBgbcejAGS
— Mythri Movie Makers (@MythriOfficial) January 25, 2021
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు. బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్ (Mahesh Babu And Keerthy Suresh) మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు.
ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల