సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఒకటని చెప్పకతప్పదు. కరోనావైరస్ లేకపోయి ఉండి ఉంటే ఈ సినిమా (SS Rajamoulis RRR) జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా వలన 8 నెలలు షూటింగ్స్ అన్నీ స్తంభించడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు అభిమానులకు దాని విడుదలపై శుభవార్త అందింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు (RRR Movie Release Date Announced) పోస్టర్ ద్వారా చిత్రయూనిట్ వెల్లడించింది.
నిప్పు, సునామీ ఒక్కటైతే ఎలాగుంటుందో తొలిసారి చూడబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో చెర్రీ రేసుగుర్రంలా దూసుకెళ్తుండగా అలనాటి బైకు మీద ఎన్టీఆర్ ఫుల్ స్పీడులో ముందుకెళ్తున్నాడు. రంకెలు వేస్తూ ఒకే వైపు గురి చూసి పయనమవుతున్నారు.
స్వాతంత్ర్య సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ (Jr NTR and Ram Charan) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రౌధ్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే.
Here's Movie Release Date:
This October 13, witness Fire 🔥 and Water 🌊 come together as a FORCE that has never been experienced before ✊🏻
The biggest collaboration in Indian cinema is set to deliver a memorable experience!!!
THE RIDE BEGINS...#RRRMovie #RRRFestivalOnOct13th #RRR pic.twitter.com/SawlxK34Yi
— RRR Movie (@RRRMovie) January 25, 2021
ఆర్‌ఆర్‌ఆర్‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఇంగ్లీష్ భామ ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భీం, రామరాజులు లక్ష్య సాధన కోసం చేసే ఫైట్ సినిమాకే హైలైట్‌గా మారనుందని టాక్. చిత్ర షూటింగ్ మరి కొద్ది రోజులలో ముగియనున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.