Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమృత ప్రణయ్?, సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్‌, అఫిషియల్ క్లారిటీ వచ్చేనా?

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ పరువు హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14న రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత భర్త ప్రణయ్ దారుణ హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుందనే కారణంఓ ప్రణయ్‌ను మారుతీరావు దారణ హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

amrutha pranay (X)

Hyd, July 24: తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ పరువు హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14న

రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత భర్త ప్రణయ్ దారుణ హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుందనే కారణంఓ ప్రణయ్‌ను మారుతీరావు దారణ హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఆ తర్వాత అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. ఇక తాజాగా త్వరలో బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వరల్‌గా మారుతోంది. సెప్టెంబర్ 1న 8వ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోండగా ఈ సీజన్‌లో అమృత ప్రణయ్ కంటెస్టెంట్‌గా రానుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి అమృత గతంలోనే సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరిగినా అలాంటిదేమి జరగలేదు. తాజాగా బిగ్ బాస్ లోకి అమృత రానున్నట్లు ప్రచారం చేస్తుండగా దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికి మిర్యాలగూడ ఘటన అనగానే గుర్తుకొచ్చేది అమృత - ప్రణయ్‌. ప్రెగ్నెంట్‌తో ఉన్న అమృతను హాస్పిటల్‌కు ప్రణయ్ తీసుకెళ్లి వస్తుండగా దారుణం చోటు చేసుకోగా ఆ తర్వాత అమృత...బాబుకు జన్మనిచ్చింది. ఆ అత్తవారితో కలిసి హైదరాబాదులో ఉంటున్న అమృత యూట్యూబ్‌ చానెల్‌ ను నిర్వహిస్తోంది. ప్రణయ్‌ జ్ఞాపకాలు, తన బాబు మెమరబుల్‌ మూమెట్స్‌, వంటకాలు, హోం టూర్స్ ను చేస్తోంది. కొంతకాలంగా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వస్తున్నారని వార్తలు వస్తుండగా ఇవి పుకార్లేనా లేకా నిజమేనా అన్నదానిపై ప్రకటన రావాల్సి ఉంది.  మిస్టీరియస్ మర్డర్లను చేధించే పాత్రలో అశ్విన్ బాబు, శివమ్ భజే మూవీ ట్రైలర్ ఇదిగో..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement