Mahesh Emotional Post: ఇటీవల కన్నుమూసిన తండ్రి కృష్ణను తలచుకొంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా’ అంటూ భావోద్వేగ సందేశం

తండ్రి కృష్ణ మృతి నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన భావోద్వేగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినీ పరిశ్రమ తొలి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Mahesh Emotional Post: ఇటీవల కన్నుమూసిన తండ్రి కృష్ణను తలచుకొంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా’ అంటూ భావోద్వేగ సందేశం
Krishana, Mahesh/File Photo (Credits: Facebook)

Hyderabad, Nov 25: తండ్రి కృష్ణ (Krishna) మృతి నేపథ్యంలో టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Maheshbabu) చేసిన భావోద్వేగ ప్రకటన సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) గా మారింది. తెలుగు సినీ పరిశ్రమ తొలి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఆస్పత్రిలో చేరిన కమల్‌ హాసన్, హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లగానే అస్వస్థత, హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు, ఇంతకీ కమల్‌ హాసన్‌కు ఏమైందంటే?

కొన్ని నెలల వ్యవధిలోనే సోదరుడు, తల్లి, తండ్రి మరణంతో మహేశ్ బాబు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. అయితే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆయన తాజా సందేశం విడుదల చేశారు. తండ్రిని వేనోళ్ల కీర్తించారు.

వేతన జీవులకు శుభవార్త.. వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన.. 75 లక్షల మందికి లబ్ధి.. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము

"నాన్నా... మీ జీవితం చరితార్థం చేసుకున్నారు. మీ నిష్క్రమణం వైభవంగా జరిగింది. అది మీ గొప్పదనం నాన్నా. మీ జీవితాన్ని మీరు నిర్భయంగా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్ఫూర్తి, నా గుండెధైర్యం అన్నీ మీతోనే పోయాయని అనుకున్నాను. కానీ విచిత్రం...! మునుపెన్నడూ లేనంత కొత్త శక్తి ఇప్పుడు నాలో కలిగింది. ఇప్పుడు నాకు భయమే లేదు నాన్నా! మీ దివ్యజ్యోతి నాపై ప్రసరిస్తున్నంత కాలం మీ ఘనతర వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళతా... మీరు మరింత గర్వించేలా చేస్తాను... లవ్యూ నాన్నా... మీరే నా సూపర్ స్టార్!" అంటూ తన పోస్టులో వివరించారు.

(The above story first appeared on LatestLY on Nov 25, 2022 09:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).