File image of MNM chief Kamal Haasan | (Photo Credits: ANI)

Chennai, NOV 24: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చాలా ఏళ్ళ తర్వాత విక్రమ్ సినిమాతో భారీ విజయం సాధించాడు కమల్. ఈ సినిమా కమల్ కి ఫుల్ జోష్ ని ఇచ్చింది. దీంతో విక్రమ్ (Vikram) తర్వాత వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు. మరో పక్క బిగ్ బాస్ లో కూడా హోస్ట్ గా చేస్తున్నాడు కమల్. నవంబర్ 23న ఉదయం కమల్ హాసన్ హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో కళాతపస్వి విశ్వనాథ్ ని (Viswanath) కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చెన్నై వెళ్లిపోయిన కమల్ అస్వస్థతకి (ill health) గురయ్యారు. కమల్ హాసన్ కి కొద్దిగా అసౌకర్యంగా అనిపించడం, జ్వరం రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు కమల్ కి చికిత్స అందించారు. కమల్ హాసన్ ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నారు.

Megastar Chiranjeevi: చిరంజీవికి అవార్డు రావడంపై ప్రధాని మోదీ ప్రశంసలు, చిరంజీవి ఒక విలక్షణమైన నటుడంటూ తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని 

కమల్‌ ఇవాళ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజులు ఆయనకు పూర్తి విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కమల్ హాస్పిటల్ లో చేరారని తెలిసి ఆయన అభిమానులు కంగారుపడ్డారు. జ్వరంతో (Fever) హాస్పిటల్ కి వెళ్లారని, ఇవాళ డిశ్చార్జ్ అవుతారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన క్షేమంగా ఇంటికి రావాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.